- స్వర్గీయ మాజీ ఎమ్మెల్సీ నరసింహాదేవర 72వ వర్ధంతి సభలో వక్తలు
ప్రజాశక్తి - ఆలమూరు: స్వర్గీయ మాజీ ఎమ్మెల్సీ నరసింహదేవర సత్యనారాయణ రైతుల అభ్యున్నతి కోసం నిరంతరం చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా పనిచేసిన నరసింహదేవర 72వ వర్ధంతి ఆలమూరు సహకార సంఘం ఆవరణలో బుధవారం అధ్యక్షుడు వంటిపల్లి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నరసింహదేవర విగ్రహానికి పూలమాలను వేసి ఘననివాళులు అర్పించారు. రైతులకు అన్ని రకాలుగా ఉపకరించే విధంగా దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రైతుల కోసం సహకార రూరల్ బ్యాంకును ఆలమూరులో స్థాపించిన ఘనత నరసింహదేవరకు దక్కుతుందని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అలాగే మండల టిడిపి అధ్యక్షుడు ఈదల సత్తిబాబు, సొసైటీ సభ్యులు రామానుజనుల సూర్య ప్రకాష్, గుడాల శ్రీను, నేతలు ఈదల నల్లబాబు, కేతా రాంబాబు, చల్లా బాబి, బైరిశెట్టి రాంబాబు, రామానుజునుల శేషగిరిరావు, ఈదల రాంబాబు, గుత్తుల కిరణ్, రావాడ సత్తిబాబు, సాలి సత్యనారాయణ, చల్లాఏడుకొండలు, తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.








కామెంట్‌లు (0)