బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మెడకు ఉరితాళ్ళతో వి ఆర్ ఎ లు వినూత్న నిరసన

1 గంట క్రితం

uri
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 12:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-మామిడికుదురు: తమ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ నిరవదిక సమ్మె చేస్తున్న విఆర్ఏలు బుధవారం 15వ రోజు వినూత్నంగా నిరసన చేపట్టారు. మామిడికుదురు ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో మెడలకు ఉరితాళ్లు బిగించుకుని ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. డిమాండ్ల పరిష్కారం కోసం గత 15 రోజులనుంచి సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వము స్పందించకపోవడం బాధాకరమని విఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వము తక్షణమే పరిష్కరించి సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వేతనాల పెంచాలని, నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రభుత్వము సానుకూలంగా స్పందించి చర్యలు జరిపి న్యాయం చేయాలని నినాదాలు చేశారు తమ సమస్యలు పరిష్కరించేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు ముస్కుడి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు మందపాటి సుబ్రహ్మణ్యం, కార్యదర్శి మెడబల బ్రహ్మాజీ, గౌరవాధ్యక్షులు మొల్లేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్