రూ.3.78 లక్షలతో ఉప్పలగుప్తం మండల అభివృద్ధి
ప్రజాశక్తి- ఉప్పలగుప్తం :
2021 సెప్టెంబర్ 24న ఎంపిపి గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు మండల పరిషత్ నిధులు రూ.3.78 కోట్లతో ఉప్పలగుప్తం మండల అభివృద్ధికి కృషి చేసినట్టు ఎంపిపి దంగేటి వీర అచ్యుత జానకి తెలిపారు. ఎంపిపి పదవీకాలం బుధవారం ముగుస్తుండడంతో చివరి రోజు ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మండలంలోని 17 గ్రామాల ఎంపిటిసి సభ్యులు సర్పంచ్ లు ఆయా శాఖల అధికారుల నాయకుల సమన్వయంతో మండలాన్ని అభివృద్ధి చేశానన్న సంతృప్తి తనకు కలిగిందన్నారు .గ్రామాల్లో సిసి, గ్రావెల్ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం, తాగునీటి పైప్ లైన్లు కల్వర్టుల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశామన్నారు. .అలాగే మండలంలోని మూడు పిహెచ్సిల అభివృద్ధి కమిటీ ఛైర్మన్గా ఉన్న తాను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి వాటి పనితీరు మెరుగుకు తన వంతు కృషి చేశానన్నారు. ఎంపిపిగా పాలనలో తన భర్త వైసిపి రాష్ట్ర కార్యదర్శి దంగేటి రాంబాబు సూచనలు సలహాలు పాటించి మండలాన్ని అభివృద్ధి చేసి ఐదేళ్లు విజయవంతంగా పాలన సాగించానని తెలిపారు. ఐదేళ్ల పాలనలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఎంపిపి అచ్యుత జానకి కృతజ్ఞతలు తెలిపారు.








కామెంట్‌లు (0)