బుధవారం, 07 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి. మహిళకు తీవ్ర గాయాలు.

1 గంట క్రితం

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి. మహిళకు తీవ్ర గాయాలు. image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 04:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - రామచంద్రపురం : మండలంలోని వెల్ల గ్రామ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీనిపై ద్రాక్షారామ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాళ్లరేవు మండలం పెదవలస గ్రామానికి చెందిన. వనమాడి దుర్గ నరేష్ (21), తన మేనమామ ఇంటికి కాలేరు గ్రామం వచ్చి మేనత్త అయిన కర్రి జ్యోతి తో కలిసి మోటారు సైకిల్ పై బ్యాంకు పని నిమిత్తం వచ్చాడు. అయితే వెల్ల లాకుల దగ్గరలో ఎదురుగా వస్తున్న గూడ్స్ వ్యాన్ వేగంగా, హారన్ కొట్టకుండా నిర్లక్ష్యంగా నడుపుతూ మోటార్ సైకిల్ ను ఢీ కొట్టింది. దీంతో తలవద్ద తీవ్ర గాయాలైన నరేష్ మృతి చెందగా, అతని మేనత్త జ్యోతి చేతికి, తలకు గాయాలయ్యాయి. ఇద్దరినీ 108 అంబులెన్స్ లో రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ కి తీసుకుని డ్యూటీ డాక్టర్ పరీక్షించి నరేష్ చనిపోయినట్లు ధ్రువీకరించారు. జ్యోతిని మెరుగైన వైద్య నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. దీనిపై ద్రాక్షారామ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కె .వీరబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్