ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బామ్ సెప్ జాతీయ మహాసభలను జయప్రదానికి పిలుపు

1 రోజు క్రితం

బామ్ సెప్ జాతీయ మహాసభలను జయప్రదానికి పిలుపు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 06:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ముమ్మిడివరం

రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కల్పించేందుకు జార్ఖండ్ రాజధాని రాంచీ లో నిర్వహిస్తున్న బామ్ సెప్ 43వ జాతీయ మహా సభలకు పెద్ద సంఖ్యలో బహుజన వాదులు హాజరై జయప్రదం చేయాలని బామ్ సెప్ కేంద్ర కమిటీ సభ్యుడు, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ నల్ల గంగాధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం నగర పంచాయతీ పరిధిలో జరిగిన ఒక కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం కొండ్రు చందర్రావు ఇంటి వద్ద జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న గంగాధర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఇవిఎం ఆధారిత ఎన్నికలను రద్దు చేసి, బ్యాలెట్ విధానంలో ఎన్నికలను నిర్వహించాలని, పెట్టుబడి దారి నియంతృత్వాన్ని పెంచి పోషిస్తున్న మనువాద విధానాల పై బామ్ సెప్ రాజి లేని పోరాటం చేస్తోందన్నారు. బహుజన రాజ్యాధికార సాధనకు బహుజనులంతా ఏకం కావాలని గంగాధర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యుడు కుమార్ బాబు, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆదినారాయణ, గెద్దాడ శ్రీనివాసరావు,

పరమేష్, జనరల్ సెక్రెటరీ జల్లి బాలకృష్ణ, ట్రెజరర్ పెట్టా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్