- నామినేషన్ కేంద్ర వద్ద అనూహ్య ఘటన
- ఎమ్మెల్యే కొండయ్యను కలిసిన వైసిపి చైర్ పర్సన్ అభ్యర్థికు ఆయన శుభాకాంక్షలు
ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : చీరాల మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల చివరి రోజైన ఆదివారం నామినేషన్ కేంద్రం వద్ద ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, వైసీపీ చైర్పర్సన్ అభ్యర్థి షెర్లి, ఆమె తండ్రి డాక్టర్ బాబురావు పరస్పరం మర్యాదపూర్వకంగా పలకరించుకున్నారు. టీడీపీ అభ్యర్థులతో కలిసి నామినేషన్ కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్యే కొండయ్యకు షెర్లి, డాక్టర్ బాబురావు ఎదురయ్యారు. దీంతో ఇరువర్గాల నేతలు చిరునవ్వుతో పలకరించుకున్నారు. ఎమ్మెల్యే కొండయ్య డాక్టర్ బాబురావుతో కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతోపాటు మహేంద్రనాథ్, అమర్నాథ్లు కూడా వారిని పలకరించారు. ఎన్నికల్లో రాజకీయ విభేదాలు సహజమే అయినా.. వ్యక్తిగత స్నేహం, పరస్పర గౌరవానికి ప్రాధాన్యతనిస్తూ నేతలు వ్యవహరించిన తీరు అక్కడి వారిని ఆకట్టుకుంది. ప్రజాతీర్పును గౌరవిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా స్నేహపూర్వక వాతావరణంలో జరగాలనే సందేశాన్ని ఈ పరిణామం చాటిచెప్పింది.








కామెంట్లు (0)