ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నిస్పక్షపాతంగా ఎన్నికలు జరపాలని ఎస్ఇసి ని కోరాం : వైఎస్.జగన్

2 గంటల క్రితం

We have requested the SEC to conduct impartial elections: Y.S. Jagan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 01:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : నిస్పక్షపాతంగా ఎన్నికలు జరపాలని ఎస్ఇసి ని కోరామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశామని వైసిపి నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎస్‌ఇసి ని వైఎస్‌ జగన్‌ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నామినేషన్‌ వేయకుండా వైసిపి అభ్యర్థులను అడ్డుకుంటున్నారనీ, ఎపిలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదని తెలిపామన్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఎస్‌ఇసి ఏం చేస్తోందని అడిగాం అని చెప్పారు. నామినేషన్‌ ప్రక్రియలోనే పోలీసులు, అధికారులు చంద్రబాబుకు కొమ్ముకాస్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. నామినేషన్‌ కేంద్రాల దగ్గరే పత్రాలు చించేస్తున్నారని అన్నారు. పారా మిలటరీ దళాలను దించాలని ఎస్‌ఇసి ని కోరాం అని తెలిపారు. కేంద్ర బలగాలను దించాలని గవర్నర్‌నూ కోరతామన్నారు. స్ట్రాంగ్‌ రూమ్స్‌లో బ్యాలెట్‌ బాక్సులు మారుస్తారని అనుమానం వ్యక్తం చేశారు. స్ట్రాంగ్‌ రూమ్స్‌లో కూడా సీసీ కెమెరాలు పెట్టాలన్నారు. కౌంటింగ్‌ హాల్‌లో కూడా సీసీ కెమెరాల నిఘా ఉండాలని కోరారు. 17 c లో ఫోర్జరీ సంతకాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ఇసి నిస్పక్షపాతంగా పనిచేయాలని కోరినట్లు వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్