mh ad
ఆదివారం, 21 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యోగాను నిత్య జీవన విధానంగా మార్చుకోవాలి

2 గంటల క్రితం

Yoga should be adopted
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 02:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -మామిడికుదురు : యోగాను నిత్య జీవన విధానంగా మార్చుకుంటే అన్ని రకాలుగా మంచి ఆరోగ్యం పొందవచ్చు అని హెచ్ ఎం ఆర్ వి ఎస్ రమాదేవి పేర్కొన్నారు. పాసర్లపూడి జడ్ పి పి హెస్ స్కూల్ లోఆదివారం ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్నారు. హైస్కూల్ హెస్ ఎం రమాదేవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కైవల్య ఆయుష్ యోగ సెంటర్కు చెందిన కేతన్ ఆకుల విద్యార్థులు, ఉపాధ్యాయులచే వివిధ రకాల యోగాసనాలు వేయించారు హై స్కూల్ పిడి కె మణి కృష్ణ పిల్లలచే వివిధ యోగాసనాలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిహెచ్ శ్రీధర్, సూరుమేను శ్రీనివాసరావు, వై శిరీష, కె పద్మావతి, కరుణజీ, కె. అర్జున్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్