శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిపిఎం గెలుపు కోసం రేపటి కామ్రేడ్ల ప్రచారం

30 అక్టోబర్, 2026

Campaigning by comrades tomorrow for a CPM victory
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 03:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-మచిలీపట్నం అర్బన్ (కృష్ణా) : మచిలీపట్నం నగరపాలక సంస్థకు జరుగునున్న ఎన్నికలలో ప్రచార పర్వానికి శుక్రవారం సాయంత్రంతో గడువు ముగిస్తుండగా చిన్నారుల సైతం వీలుల్లోకి వచ్చి సిపిఎం అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. 45వ డివిజన్ సిపిఎం పార్టీ నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిపిఎం నగర కమిటీ కన్వీనర్ బూర సుబ్రహ్మణ్యం గెలుపు కోసం డివిజన్ కు చెందిన చిన్నారులు ఠాగూర్, తమన్విక, రిత్విక ప్రతి వీధిలోను ప్రచార రిక్షాపై జెండాలు, ఎన్నికల గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం ప్లకార్డులు చేతపట్టి సిపిఎం అభ్యర్థి సుబ్రహ్మణ్యం భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా యువతీ యువకులు పెద్దలు అందరిని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఠాగూర్ జ్వరంతో బాధపడుతూ చేతికి సూది గుచ్చి ఉన్న కూడా ప్రచారం నిర్వహించడం విశేషం. చిన్న వయసులోనే సిపిఎం పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం బడి కూడా మానేసి ఎండను సైతం లెక్కచేయకుండా ప్రచారంలో పాల్గొంటున్న చిన్నారులను చూసి డివిజన్ ఓటర్లు తమ ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్