బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బందరులో నేలకొరిగిన భారీ వృక్షాలు

58 నిమిషాల క్రితం

Large trees toppled in Bandar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026, 04:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-మచిలీపట్నం అర్బన్ (కృష్ణా) : మచిలీపట్నం లో తుఫాను ప్రభావంతో జనజీవనం స్తంభించింది. భారీ వృక్షాలు నేలకొరిగి రహదారులు మూసుకుపోయాయి. నగరంలోని ప్రధాన రహదారులన్నీ మోకాళ్ళలోతు నీళ్ల తో నిండిపోయాయి. అత్యవసరం అయితే తప్ప ఇల్లు విడిచి బయటకు రావద్దని పోలీసు అధికారులు ప్రజలను హెచ్చరించారు. జిల్లా ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడిపోయి రాకపోకలు ఆగిపోయాయి. ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాయి. బచ్చుపేట శివాలయం వెనక పెద్ద మామిడి చెట్టు పడిపోయి బాలికల హాస్టల్ భవనం పైకి ఒరిగిపోయింది. మచిలీపట్నం ఉత్తర, దక్షిణ మండలాల్లో బుధవారం ఒక్కరోజే 112.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాబడి రికార్డు సృష్టించింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్నాబ్ తుఫాను ఉదయమే తీరం దాటినప్పటికీ బుధవారం సాయంత్రం వరకు కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. బలమైన ఈదురు గాలుల తీవ్రతకు పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు తమ నివాసాల భద్రతపై ఆందోళన చెందుతున్నారు. మంగళవారం రాత్రి 10 గంటలకు విద్యుత్ సరఫరా ఆగిపోగా ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతం గా ఉన్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్