అమరావతి : రాష్ట్రంలో ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల పోలింగ్, కౌంటింగ్‌ను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ రీ షెడ్యూల్ చేసింది. నవంబర్ 5 వ తేదీన రాష్ట్రంలో ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల పోలింగ్ జరగుతుందని, నవంబర్ 7వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం కీలక ప్రకటన చేసింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపడి నవంబర్ 1 వ తేదీన పోలింగ్, 3 వ తేదీన కౌంటింగ్ నిర్వహించాలని గతంలో ఎస్‌ఇసి నిర్ణయించిన విషయం తెలిసిందే. నిన్న (మంగళవారం) సుప్రీం కోర్టు ... స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ రోజు జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల తేదీలను రీ షెడ్యూల్ చేయాలని ఎపి ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.
Reschedule - ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ రీ షెడ్యూల్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 28, 2026, 04:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)