ప్రజాశక్తి-చల్లపల్లి : ఢిల్లీలో జరగనున్న కార్మిక ఉద్యమానికి తరలి వెళుతున్న సిఐటియు నాయకులను పలువురు అభినందించారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆదివారం ఢిల్లీ ముట్టడికి తరలి వెళుతున్న కార్మిక నాయకులు మహమ్మద్ కరీముల్లా, సేలం శ్రీనివాసరావులను పూలమాలతో సత్కరించి, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం మండల పార్టీ కార్యదర్శి యద్దనపూడి మధు మాట్లాడుతూ.. ప్రజా కార్మిక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం రూ 42 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ముట్టడి కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.
ఢిల్లీ ముట్టడి కార్యక్రమం విజయవంతం కావాలి
18 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 29, 2026, 07:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)