ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బాలికలు, మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాలి

36 నిమిషాల క్రితం

బాలికలు, మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాలి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 07:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి - కాకినాడ : బాలికలు, మహిళలపై రోజురోజుకూ పెరుగుతున్న దాడులు, వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్ మోహన్ డిమాండ్ చేశారు. మహిళలకు తగిన రక్షణ కల్పించడంలో పాలక ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడలోని యూటీఎఫ్ హోమ్ హాల్‌లో శనివారం ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా బాలికల కన్వెన్షన్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలు విద్యా రంగంలోనూ, సమాజంలోనూ స్వేచ్ఛగా ముందుకు సాగేందుకు అనుకూలమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. రాష్ట్ర బాలికల కో-కన్వీనర్ జ్యోతి మాట్లాడుతూ విద్యార్థినులకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని, మహిళల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. విద్యార్థినులు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

జిల్లా బాలికల నూతన కమిటీ ఎన్నిక

ఈ కన్వెన్షన్‌లో ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా బాలికల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా నూతన కన్వీనర్‌గా చి. అమృత, కో-కన్వీనర్లుగా చిన్ని, పుష్ప, లక్ష్మీ భాయ్, క్రాంతి ఎన్నికయ్యారు. అలాగే కమిటీ సభ్యులుగా తేజు, అక్షయ, జ్యోతి, నిఖిత, లోహిత, రాజి, అమృత, పూజిత, సోనాలి, నూకమ్మ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలువురు ఎస్ఎఫ్ఐ విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్