ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వాట్సాప్‌లో 'షెడ్యూల్' సదుపాయం

26 నిమిషాల క్రితం

వాట్సాప్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 07:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

వెబ్ డెస్క్ : ముఖ్యమైన రోజుల్లో శుభాకాంక్షలు చెప్పడం ఇక మర్చిపోవాల్సిన అవసరం లేదు. వాట్సాప్‌లో సందేశాలను ముందుగానే షెడ్యూల్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో నిర్ణీత సమయానికి ఆటోమేటిక్‌గా సందేశాలు పంపుకోవచ్చు.

ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమకు కావాల్సిన తేదీ, సమయాన్ని ఎంచుకుని సందేశాలను షెడ్యూల్ చేసుకోవచ్చు. 10 నిమిషాల నుంచి 14 రోజుల వరకు ముందుగానే సందేశాలను షెడ్యూల్ చేసే అవకాశం ఉంది. వ్యక్తిగత చాట్‌లతో పాటు గ్రూప్ చాట్‌లలోనూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.

సందేశాలను షెడ్యూల్ చేయాలంటే ముందుగా వాట్సాప్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి. అనంతరం సందేశం పంపాలనుకుంటున్న వ్యక్తి లేదా గ్రూప్ చాట్‌ను ఓపెన్ చేయాలి. పంపాలనుకుంటున్న సందేశాన్ని టైప్ చేసి, సెండ్ బటన్‌ పై నొక్కి ఉంచితే, ఆ తర్వాత సందేశం పంపాల్సిన తేదీ, సమయాన్ని ఎంచుకోవాలి. ఎంచుకున్న వివరాలను నిర్ధారించగానే సందేశం షెడ్యూల్ అవుతుంది. నిర్ణీత సమయానికి సందేశం ఆటోమేటిక్‌గా పంపబడుతుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్