ప్రజాశక్తి-అవనిగడ్డ
మోపిదేవి బిసి ఆశ్రమ పాఠశాలలో శనివారం అనుమానస్పదంగా మృతి చెందిన పదో తరగతి విద్యార్థి లంకె. కుమార్ రాజా మృతి పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అవనిగడ్డ ప్రభుత్వ ఏరియా వైద్యశాల ఎదుట ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో చేశారు. తమ కుమారుడు ఎందుకు మరణించాడో తెలియదని, కుమారుని ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించి వార్డెన్, హాస్టల్ సిబ్బంది వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఆందోళనకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. రవి, జిల్లా కార్యదర్శి సమరం, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోవ గోవర్ధన్ మద్దతు తెలిపారు. ఈ సంఘటనకు బాధ్యులైన వార్డెన్, వాచ్మెన్, పాఠశాల ప్రిన్సిపల్ లను తక్షణమే అరెస్టు చేయాలని, బాలుడు కుటుంబానికి రూ 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. సీఐ. యువ కుమార్, చల్లపల్లి సిఐఅవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక, కోడూరు, చల్లపల్లి, ఘంటసాల ఎస్ఐలు సిబ్బందితో వచ్చి ఆందోళన నిర్మించే ప్రయత్నం చేశారు. ఎప్పటికీ గ్రామస్తులు బాధితులు పట్టు వదలకుండా మూడు గంటల పాటు ఆందోళన కొనసాగించారు. కాగా అగ్నికుల క్షత్రియ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు , మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, బాధితులతో సంప్రదించి వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారులతో సంప్రదించి, పాఠశాల హెచ్ఎం, హాస్టల్ వార్డెన్, వాచ్మెన్లను తక్షణమే సస్పెండ్ చేయాలని, సంఘటనపై ఎంక్వయిరీ నిర్వహించి పై ముగ్గురు దోషులుగా తేలితే వారిని రిమాండ్ కి తరలించడం జరుగుతుందని పోలీసులు హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు ఈ ఆందోళనకు వైసిపి యువనేత, దేవ నాయకులు బడే గౌతమ్ కూడా బాధితుల తరఫున పాల్గొని మద్దతు తెలిపారు. ఈ ఆందోళనలతో సుమారు మూడు గంటలపాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది ఇరువైపులా వాహనాలు బార్లు తీరి నిలిచిపోయాయి. కాగా బాలుడి మృతదేహం అవనిగడ్డ మార్చురీలో భద్రపరిచారు. ప్రభుత్వం తమకు సరైన న్యాయం చేసేందుకు హామీ ఇచ్చేంతవరకు పోస్టుమార్టం చేయడానికి వీల్లేదని కుటుంబ సభ్యులు భీష్మించి కూర్చున్నారు.






కామెంట్లు (0)