సోమవారం, 09 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సామాన్యుడికి చేరువలో చట్టం - డిఎల్‌ఎస్‌ఎ కృషితో వేలాదిమందికి ఊరట

15 నిమిషాల క్రితం

సామాన్యుడికి చేరువలో చట్టం
- డిఎల్‌ఎస్‌ఎ కృషితో వేలాదిమందికి ఊరట 
- సివిల్‌ కేసుల పరిష్కారంలో జిల్లా రికార్డు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 09:08 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- సివిల్‌ కేసుల పరిష్కారంలో జిల్లా రికార్డు


ప్రజాశక్తి-గుంటూరు లీగల్

మనిషి నిద్ర లేచింది మొదలు నిద్రించే వరకూ, తల్లిగర్భంలో ఉన్న స్థితి నుండి మరణించే వరకూ చట్టం మనవెంటే ఉంటుంది. అన్ని వేళలా మనల్ని అంటిపెట్టుకున్నట్లు ఉన్నా.. మనదేశంలో చాలా మందికి చట్టానికి సంబంధించిన అంశాలు, ప్రజలకు లభించే హక్కులపై సరైన అవగాహన లేదు. దీని వల్ల అనేక ఇబ్బందులు, అన్యాయాలు, దోపీడీలకు గురవుతున్న సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో రాజ్యాంగంలో 39ఎ అధికరణంలో పేదలకు ఉచిత న్యాయసహాయం అనే అంశం పొందుపరిచారు. ఆర్టికల్ 39ఎ ప్రకారం న్యాయ సేవాధికార చట్టాన్ని 1987లో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.ఎం.భగవతి అధ్యక్షతన ఇతర సుప్రీం కోర్టు న్యాయమూర్తుల కృషితో పార్లమెంట్‌‌లో చట్టం కోసం ప్రవేశపెట్టారు. అనంతరం 1995 నవంబర్ 9న ఈ చట్టం అమల్లోకి వచ్చింది. అప్పటి నుండి ఆరోజును న్యాయ సేవాధికార దినోత్సవంగా జరుపు కుంటున్నాము.

​

ప్రజలలో పెరుగుతున్న న్యాయ అవగాహన

న్యాయసేవాధికార చట్టం అమలులోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రజలకు న్యాయపరమైన అంశాలపై అవగాహన పెరుగుతుంది. అందుకు సుప్రీం కోర్టు నుండి కింది స్థాయి న్యాయస్థానాల వరకూ కమిటీలు ఏర్పాటు చేసి, న్యాయ సేవలను సామాన్యులకు చేరువ చేసేందుకు కృషి చేస్తు న్నారు. ఈ చట్టం అమలుకు మండల స్థాయి నుండి జాతీయ స్థాయి వరకూ కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలను సుప్రీం కోర్టు నుండి స్థానిక కోర్టు వరకూ ఆయా న్యాయమూర్తులు పర్యవేక్షిస్తూ ఉంటారు. న్యాయసేవాధికార సంస్థ ముఖ్యంగా మూడు అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుంది. న్యాయసేవాధికార సంస్థ పేదలకు ఉచిత న్యాయసహాయం అందించటం, న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేయటం, లోక్ అదాలత్‌ నిర్వహిస్తుంది.కక్షిదారులు తమ సమస్యలను, కేసులను లోక్ అదాలత్ ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటున్నారు. లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకుంటే ఆ తీర్పునకు చట్టబద్దత కల్పించారు. దీంతోపాటు ఆ తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి అప్పీలుకు వెళ్లే అవకాశం లేదు. మరోవైపు పలు రకాలుగా న్యాయసహాయం దొరకక ఇబ్బంది పడుతున్న వివిధ బలహీనవర్గాల వారికి, ఆర్ధిక స్థోమత లేనివారికి ఈ చట్టం ద్వారా ఉచితంగా న్యాయసహాయం అందిస్తున్నారు. ఈ చట్టాన్ని ఉపయోగించుకున్న వారు కోర్టు ఫీజులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. వీటితోపాటు సమస్యను ముందుగా పరిశీలించి, ప్రీలిటిగేషన్ ద్వారా కేసును రాజీమార్గంలో పరిష్కరించటానికి కృషి చేస్తుంది.


​గుంటూరు న్యాయసేవాధికార సంస్థ కృషి

జిల్లా స్థాయిలో న్యాయ సేవాధికార సంస్థకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చైర్మన్ గా ఉంటారు. అలాగే కార్యదర్శిగా సీనియర్ సివిల్ జడ్జి ఉంటారు. ప్రస్తుత కార్యదర్శిగా సయ్యద్‌ ‌జియావుద్దీన్‌ ‌ఉన్నారు. జిల్లా ప్రధానన్యాయమూర్తి, డిఎల్‌ఎస్‌ఎ చైర్మన్‌ బి.సాయి కళ్యాణ చక్రవర్తి కృషి ఫలితంగా గత సంవత్సర కాలంలో నాలుగు జాతీయ లోక్‌ అదాలత్‌‌ల విజయవంతంగా నిర్వహించి, 5,889 సివిల్‌ కేసులు, క్రిమినల్‌ ‌కేసులు 85,033

మొత్తం 90,922 కేసులు పరిష్కరించగలిగారు. ఈ పరిష్కారం ద్వారా మొత్తం 370 కోట్ల, 65 లక్షల, 44వేల, 25 రూపాయలు సెటిల్‌‌మెంట్‌ ‌ద్వారా కక్షిదారులకు అందించగిలారు. సివిల్‌ ‌కేసుల పరిష్కారంలో రాష్ర్టంలోనే వరుసగా 6 సార్లు మొదటి స్థానంలో నిలిచారు. గురజాల జిల్లా కోర్టులో మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో సబ్‌ ‌స్టేషన్‌ ఏర్పాటు నిమిత్తం 71.5 ఎకరాల భూమికి సంబంధించి 4 దశాబ్దాలుగా పెండింగ్‌‌లో ఉన్న 24 భూసేకరణ అప్పీళ్లను పరిష్కరించి అందరి మన్నననులు పొందారు. కన్నవారు, దత్తత తీసుకున్న వారి నిరాదరణకు గరైన ఒక బాలిక డిఎల్‌ఎస్‌ఎను ఆశ్రయించగా, బాలికా సంరక్షణ గృహంలో రక్షణ కల్పించి, చదువు కొనసాగించే చర్యలు తీసుకున్నారు.

​

న్యాయ చేయూత సహాయ కేంద్రాలు ఏర్పాటు..

న్యాయసేవాధికార సంస్థ గుంటూరు ప్రభుత్వ జనరల్‌ ‌హాస్పిటల్లో, గుంటూరు ఆర్‌‌డిఒ కార్యాలయం, కలెక్టరేట్‌‌లో, విజ్ఞాన్‌ ‌యూనివర్సిటీలో న్యాయ చేయూత సహాయ కేంద్రాలు ( లీగల్‌ ఎయిడ్‌ ‌క్లినిక్స్‌) ఏర్పాటు చేసి, శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు కలిగిన వారికి ధృవీకరణ పత్రాల జారీలో, వారి వైద్యచికిత్స విషయంలో, కుటుంబ సమస్యలతో వచ్చే వారికి, వయోవృద్ధులు, విద్యార్థుల సమస్యలపై వారికి అవసరమైన సహాయ సహాకారాలు అందించటం జరుగుతుంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్