సోమవారం, 09 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య

13 నిమిషాల క్రితం

స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 09:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి-కంకిపాడు

ప్రాణస్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన ఘటన కంకిపాడు మండలం కోలవెన్ను పంచాయతీ పరిధిలోని మాదాసువారిపాలెంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం మంగపట్ల పాపారావు (30), పునాదిపాడుకు చెందిన స్నేహితుడు చంద్రగిరి నవీన్ స్నేహితులు. నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో నవీన్ మృతి చెందాడు. అప్పటి నుంచి స్నేహితుడి మరణాన్ని జీర్ణించుకోలేక పాపారావు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఈనెల 8వ తేదీ రాత్రి ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి బంధువు బండారు వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్