స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ‘ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం – పర్యావరణాన్ని పరిరక్షిద్దాం’ అనే సంకల్పంతో మేయర్ గారి కార్యాలయం వద్ద వినూత్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంటూరు నగర మేయర్ లక్ష్మీ అపర్ణ కోవెలమూడి, ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు వడ్డెర , మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం, పర్యావరణ పరిరక్షణ అంశాలను ప్రధానంగా తీసుకుని కళాకారులు ప్రదర్శించిన వీధి నాటకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నృత్యాలు, పాటలు, అర్థవంతమైన సంభాషణలతో ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను కళ్లకు కట్టినట్లు వివరించారు. కళాకారుల ప్రదర్శనలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు పర్యావరణంపై ఆలోచింపజేశాయి. ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా వస్త్ర సంచులు, పునర్వినియోగ చేతి సంచులను ఉపయోగించాలని, ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో చిన్న చిన్న మార్పులతో పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని ఈ కార్యక్రమం ద్వారా సందేశమిచ్చారు.







కామెంట్లు (0)