– నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్ డిమాండ్
ప్రజాశక్తి-నెల్లూరు
నెల్లూరు రూరల్ మండలం, మాదరాజు గూడూరు గ్రామంలో అమానవీయ ఘటన సోమవారం చోటుచేసుకుంది. అప్పు వివాదంలో దళితుడిపై ఓ మహిళ సలసల కాగే నూనె పోసి దాడి చేశారు. ఈ ఘటనపై బాధితుడు తెలిపిన వివరాల మేరకు... మాదరాజు గూడూరు గ్రామానికి చెందిన షేక్ హసీన అనే మహిళ వద్ద దళితుడు బద్దిపూడి శీనయ్య రూ.500 అప్పు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పడిన వివాదం తీవ్రరూపం దాల్చడంతో సదరు మహిళ తన టిఫిన్ అంగడిలో సలసల కాగే నూనెను శీనయ్యపై పోశారు. ఒక వ్యక్తిపై ఇంతటి క్రూరమైన దాడికి పాల్పడడం తీవ్రంగా ఖండించాల్సిన విషయం అని కెవిపిఎస్ నాయకులు పేర్కొన్నారు. దీంతో శృనయ్య గాయపడ్డారు. ఈ దాడిలో గాయపడిన బాధితుడికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని, ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు జి సుధీర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నేలపాటి రఘురామయ్య, ఆలూరు తిరుపాలు డిమాండ్ చేశారు.







కామెంట్లు (0)