ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నం మండల జడ్ పిటిసి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రెంటపల్లి వెంకటేశ్వరరావు భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లా ఎన్నికల అధికారి సుశీల చేతుల మీదుగా ఆయన అధికారిక గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని (డిక్లరేషన్ సర్టిఫికెట్) అందుకున్నారు. భారీ ఆధిక్యంతో విజయం సాధించిన వెంకటేశ్వరరావును స్థానిక ఎమ్మెల్యే అభినందించారు. మండల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజల ఆశయాలను నెరవేర్చాలని ఆకాంక్షించారు.







కామెంట్‌లు (0)