బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

శ్రీ దేవీ కరుమారి అమ్మన్ శక్తి పీఠంలో చోరీ

2 గంటల క్రితం

శ్రీ దేవీ కరుమారి అమ్మన్ శక్తి పీఠంలో చోరీ

హుండీ పగులగొట్టి నగదు అపహరణ.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 06:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

* హుండీ పగులగొట్టి నగదు అపహరణ..

* దర్యాప్తు చేపట్టిన పోలీసులు


​ప్రజాశక్తి-విజయవాడ సిటీ

కొత్తపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సీవీఆర్‌ ఫ్లైఓవర్‌ సమీపంలో ఉన్న శ్రీ దేవీ కరుమారి అమ్మన్ శక్తి పీఠంలో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఆలయ హుండీని పగులగొట్టి అందులోని వేలాది రూపాయల కానుకలను అపహరించుకుపోయారు. ఆలయ పీఠాధిపతి శ్రీ కరుణానంద స్వామి అందించిన సమాచారంతో సిఐ కొండలరావు, క్రైమ్‌ ఎస్‌ఐ హరిప్రసాద్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌ టీమ్ వేలిముద్రలను సేకరించగా, దుండగులు హుండీ పగులగొట్టేందుకు వాడిన సుత్తి తదితర పరికరాలను అక్కడే వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ట్రస్ట్‌ కార్యదర్శి ఎస్‌.జ్ఞానేశ్వర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్