బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు

2 గంటల క్రితం

ఆయుర్వేద ఐటమ్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 07:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి - హెల్త్ యూనివర్సిటీ

11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ డాక్టర్ ఎన్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజల ఆరోగ్యం, ఆయుర్వేద వైద్య విధాన అభివృద్ధిని ఆకాంక్షిస్తూ భక్తిశ్రద్ధలతో శ్రీ ధన్వంతరి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయుష్ శాఖ డైరెక్టర్ గోపాలకృష్ణ రొణంకి, అదనపు డైరెక్టర్ డాక్టర్ పి. సాయి సుధాకర్, డిప్యూటీ డైరెక్టర్ జె. ధనుంజయరావు ముఖ్య అతిథులుగా హాజరై, సిసిఆర్ఎసి-స్పార్క్ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన యూజీ, పీజీ విద్యార్థులకు చెక్కులు అందజేశారు. అలాగే వివిధ పోటీలలో విజేతలకు అవార్డులు, బహుమతులను ప్రదానం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. బుల్లయ్య, డాక్టర్ ఎల్‌ఎల్ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి. జగదీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, ఆసుపత్రి సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్