బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

52వ డివిజన్‌లో బోయి సత్యబాబు ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన..

4 రోజుల క్రితం

ఎర్రజెండాల రెపరెపల మధ్య సీపీఎం ప్రచార ముగింపు యాత్ర

52వ డివిజన్‌లో బోయి సత్యబాబు ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన.. image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 08:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

* వంద మీటర్ల అరుణ పతాకంతో సిపిఎం భారీ ప్రదర్శన


​ప్రజాశక్తి-విజయవాడ సిటీ

గత పది రోజులుగా సాగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార పర్వానికి శుక్రవారంతో తెరపడింది. ఇందులో భాగంగా 52వ డివిజన్ సిపిఎం అభ్యర్థి బోయి సత్యబాబు ఆధ్వర్యంలో కొత్తపేటలోని సిపిఎం కార్యాలయం 'మోటూరు హనుమంతరావు శ్రామిక్ భవన్' నుంచి భారీ ప్రచార ముగింపు ప్రదర్శన నిర్వహించారు. సుమారు 100 మీటర్ల భారీ అరుణ పతాకంతో, ఎర్రజెండాల రెపరెపలు, కార్యకర్తల ఉత్సాహపూరిత నినాదాల మధ్య సాగిన ఈ యాత్ర డివిజన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా పలువురు సీపీఎం నాయకులు మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం, డివిజన్ సమగ్ర అభివృద్ధి కమ్యూనిస్టు అభ్యర్థులతోనే సాధ్యమవుతాయని పేర్కొన్నారు. నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాడే అభ్యర్థులను తమ విజ్ఞతతో ఎన్నుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సామాన్య ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పోరాడే తమ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ప్రచారాన్ని ముగించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్