బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సీపీఎంతోనే నగర అభివృద్ధి సాధ్యం: 50, 52వ డివిజన్లలో బోరా ప్రసాద్‌, బోయి సత్యబాబు ప్రచార ముగింపు యాత్ర

4 రోజుల క్రితం

సీపీఎంతోనే నగర అభివృద్ధి సాధ్యం

50, 52వ డివిజన్లలో బోరా ప్రసాద్‌, బోయి సత్యబాబు ప్రచార ముగింపు యాత్ర image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 08:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి-విజయవాడ సిటీ

నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచార చివరి రోజైన శుక్రవారం 50వ డివిజన్ సీపీఎం అభ్యర్థి బోరా ప్రసాద్, 52వ డివిజన్ అభ్యర్థి బోయి సత్యబాబు సంయుక్తంగా ప్రచార యాత్ర నిర్వహించారు. వన్‌టౌన్‌లోని కృష్ణవేణి కాంప్లెక్స్, మహంతిపురం తదితర ప్రాంతాల్లో పర్యటించిన వారు వాణిజ్య సముదాయాలు, ఇళ్లకు వెళ్లి ఓటర్లను నేరుగా కలుసుకుని, సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం, పేదల సంక్షేమం, నగర సమగ్ర అభివృద్ధి కమ్యూనిస్టు పోరాటాలతోనే సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. విజయవాడ నగరాభివృద్ధిలో సీపీఎం కీలక పాత్ర పోషించిందని గుర్తుచేస్తూ, నిరంతరం ప్రజల తరఫున నిలబడి పోరాడే కమ్యూనిస్టు అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్