బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

47వ డివిజన్‌లో సీపీఎం ప్రచార ముగింపు ప్రదర్శన....

4 రోజుల క్రితం

47వ డివిజన్‌లో సీపీఎం ప్రచార ముగింపు ప్రదర్శన....

సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటేయాలని కోరాడ వెంకటరత్నం విజ్ఞప్తి.. image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 08:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటేయాలని కోరాడ వెంకటరత్నం విజ్ఞప్తి..


​ప్రజాశక్తి-విజయవాడ సిటీ

​47వ డివిజన్‌లో కోరాడ వెంకటరత్నం శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. గత వారం రోజులుగా కొండలు, గుట్టలతో కూడిన డివిజన్ వ్యాప్తంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిపిఎంను ఆదరించి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచార చివరి రోజున నెహ్రూ బొమ్మ సెంటర్ నుంచి బ్రాహ్మణ వీధి మీదుగా సీపీఎం శ్రేణులతో కలిసి భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పన, పేదల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడే వెంకటరత్నాన్ని గెలిపించాలని కోరారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్