మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత : జిల్లా కలెక్టర్

6 రోజుల క్రితం

పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత :జిల్లా కలెక్టర్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 07:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -విజయవాడ

ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2026ను పటిష్టంగా అమలు చేసేందుకు 20 మంది కీలక అధికారులతో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, పర్యావరణ పరిరక్షణ చట్టం, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు తక్షణమే దీన్ని అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు. ఈ కమిటీకి కలెక్టర్ ఛైర్‌పర్సన్‌గా, జాయింట్ కలెక్టర్ వైస్ ఛైర్‌పర్సన్‌గా, విజయవాడ మున్సిపల్ కమిషనర్ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. పాత డంపింగ్ యార్డుల్లో బయోమైనింగ్ పనుల వేగవంతం, అనుమతి పొందిన మూసి ఉన్న వాహనాల్లోనే చెత్త రవాణా జరిగేలా ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలు, వాహనాల సీజ్, సంస్థల మూసివేతతో పాటు విద్యుత్, నీటి సరఫరా నిలిపివేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్టీఆర్ జిల్లాను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్