ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రొంపిచర్ల మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి కె.శ్రీనివాసులు తెలిపారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. ఎన్నికల నియమావళి అమలును పర్యవేక్షించేందుకు ఎంసీసీ, ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా బృందాలకు శిక్షణ కూడా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ఎంపీటీసీ అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని, 24వ తేదీన నామినేషన్ల పరిశీలన, 27వ తేదీన ఉపసంహరణ ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపారు. అదే రోజు తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామన్నారు. వచ్చే నెల 3వ తేదీన పోలింగ్, అవసరమైతే 4వ తేదీన రీపోలింగ్, 5వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని శ్రీనివాసులు సూచించారు.
నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు...
19 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 19, 2026, 12:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)