వందేళ్లుగా నీడనిచ్చిన మహా వృక్షం... వర్షాల ధాటికి ఒక్కసారిగా వేళ్లతో సహా నేలకొరిగింది. కవిటి మండలంలోని ప్రగడపుట్టుగ–కపాసుకుద్ది మార్గంలో మంగళవారం రాత్రి భారీ మర్రి వృక్షం కూలడంతో రెండు విద్యుత్ స్తంభాలు, నాలుగు స్పానెల్ కండక్టర్లు దెబ్బతిన్నాయి. దీంతో రాకపోకలతోపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న లైన్‌మెన్ సంతోష్ ఉన్నతాధికారులకు తెలియజేశారు. వారి ఆదేశాలతో అటు రెవెన్యూ, ఇటు పంచాయతీ అధికారులు, ఎస్‌ఐ రవివర్మ, విద్యుత్ శాఖ అధికారులు పర్యవేక్షణలో చెట్టును తొలగించారు. అనంతరం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి, రహదారిని రాకపోకలకు అనువుగా చేశారు.










కామెంట్‌లు (0)