ప్రజాశక్తి-పరిగి
మండలంలోని మోద-3 ఎంపీటీసీ స్థానానికి బరిలో ఉన్న టిడిపి అభ్యర్థి శాంతమ్మ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆమె గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిసి కరపత్రాలు పంపిణీ చేశారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. అలాగే ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కొన్నేళ్లుగా శాంతమ్మ భర్త సంజీవరాయప్ప టిడిపిలో క్రియాశీలక నాయకుడిగా గుర్తింపు పొందారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ స్థానిక ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. కూటమి హయాంలో రెండున్నరేళ్లుగా మోద-3 ఎంపీటీసీ పరిధిలోని గ్రామాల్లో చేపట్టిన రహదారుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వివిధ సంక్షేమ పథకాల అమలు, తదితర అంశాలను టీడీపీ నాయకులు ప్రజలకు వివరిస్తున్నారు. శాంతమ్మ ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. ఎన్నికల ప్రచారం రోజురోజుకూ ఊపందుకుంటున్న నేపథ్యంలో మోద-3 ఎంపీటీసీ పరిధిలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది.









కామెంట్‌లు (0)