ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మైనర్ బాలికపై నేరానికి పాల్పడిన నిందితుడి అరెస్ట్

1 గంట క్రితం

Accused arrested for committing a crime against a minor girl.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 05:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రైల్వే కోడూరు (తిరుపతి) : రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికపై జరిగిన నేరానికి సంబంధించి నమోదు చేసిన కేసులో నిందితుడైన చీరాల రమేష్ బాబును అరెస్టు చేసినట్లు రేణిగుంట డిఎస్పి వై. శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి మాట్లాడుతూ .... కేసు దర్యాప్తులో భాగంగా అందుబాటులో ఉన్న ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించి, నిందితుడి ప్రమేయంపై విచారణ చేపట్టిన అనంతరం 3వ తేదీన నిందితుడిని అరెస్ట్ చేసి, అనంతరం చట్టపరమైన నిబంధనల ప్రకారం అవసరమైన వైద్య పరీక్షలు, ఇతర విధి విధానాలను పూర్తి చేసి, తదుపరి జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం ఆదివారం మేజిస్ట్రేట్ వారి ఎదుట హాజరుపరిచామని, మైనర్ బాలికకు సంబంధించిన కేసు కావడంతో, బాధిత బాలిక గుర్తింపు, వ్యక్తిగత వివరాలు లేదా కుటుంబ సభ్యుల వివరాలను బహిర్గతం చేయడం లేదని, బాలికకు సంబంధించిన వివరాల గోప్యతను కాపాడుతూ, చట్టపరమైన నిబంధనల ప్రకారం కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను శాస్త్రీయంగా సేకరించి, దర్యాప్తును నిష్పక్షపాతంగా, వేగవంతంగా పూర్తి చేసి, చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్