ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ (గుంటూరు) : ఈ నెల 10వ తేదీన కారంపూడి లో జరగనున్న రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎం టి ఎం సి పరిధిలోని వడ్డేశ్వరం జడ్పీ హైస్కూల్ లో 8, 9, 10 తరగతులు చదువుతున్న ముగ్గురు విద్యార్థులు గోల్డ్ మెడల్స్ సాధించినట్లు జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఎం ఉమాశ్రీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కారంపూడి జడ్పీ హైస్కూల్లో శనివారం నిర్వహించిన రెజ్లింగ్ సెలక్షన్స్ లో వడ్డేశ్వరం జడ్పీ హైస్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు. ఎనిమిదవ తరగతి చదువుతున్న తులసి బాయ్ అండర్ 14 బాలికల 42 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ ను, 9వ తరగతి చదువుతున్న భువనేశ్వరి భాయ్ అండర్ 17 విభాగంలో 48 కేజీల కేటగిరీలో గోల్డ్ మెడల్ ను సాధించింది. అండర్ 17 విభాగంలో 10వ తరగతి చదువుతున్న ప్రియదుర్గ 52 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ ను సాధించిందని ఆమె తెలిపారు. ఈ ముగ్గురు విద్యార్థులు సాధించిన విజయం కన్న తల్లిదండ్రులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు, స్కూలుకు గర్వకారణమని ప్రశంసించారు. ఈ క్రీడాకారులకు మంచి శిక్షణ ఇచ్చిన పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు మెల్లంపూడి రవి, నూతక్కి రవి లను పాఠశాల ఉపాధ్యాయులు కాకుమాను జోజప్ప, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్, గ్రామ పెద్దలు అభినందించారు.
రెజ్లింగ్ సెలక్షన్స్ - హైస్కూల్ విద్యార్థినీలకు గోల్డ్ మెడల్స్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 04, 2026, 05:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు





కామెంట్‌లు (0)