మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బ్యాగుకు కన్నం.. బంగారు నగలు మాయం

28 ఆగస్టు, 2026

Bag slit open... gold jewelry missing.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 03:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తిరుపతి : రిటైర్డ్ ఉద్యోగి బ్యాగుకు కన్నం వేసిన దొంగలు 14 గ్రాముల బంగారు నగల పర్సును కాజేసిన ఘటన తిరుపతి జిల్లా ఐరాల మండలంలో శుక్రవారం జరిగింది. ఐరాల మండలానికి చెందిన రూపులత అనే మహిళ తన మనవరాలికి బంగారం కొనడానికి తిరుపతికి వచ్చింది. జువెలరీ షాప్ లో 14 గ్రాముల బంగారు నగలను కొని ఇంటికి వెళ్లడానికి ఆటోలో బాలాజీ కాలనీ నుండి బస్టాండ్ కు బయలుదేరింది. బస్టాండ్ కు చేరుకున్న మహిళ తన బ్యాగును చూసుకోగా కత్తిరించి ఉండటాన్ని గమనించి వెంటనే పర్సు కోసం వెతికింది. నగలు కొన్న పర్సు కనబడకపోవడంతో ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 441/2026 కేసు నమోదు చేసిన ఈస్ట్ ఎస్సై ప్రసాద్ విచారణ చేపట్టారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్