మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మహారాష్ట్ర యుసిసి కమిటీకి మాజీ జడ్జి ఆర్‌.సి.చవాన్‌ రాజీనామా

1 గంట క్రితం

Chavan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 12:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : మహారాష్ట్ర ఏకరూప పౌరస్మృతి (యుసిసి) కమిటీకి మాజీ జడ్జి ఆర్‌.సి.చవాన్‌ రాజీనామా చేసినట్లు సంబంధిత అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. కమిటీలోని ఒక అధికారితో విబేధాలు తలెత్తడంతో ఆయన రాజీనామా చేసినట్లు వెల్లడించారు. యుసిసి అమలుకు సంబంధించిన ముసాయిదాను రూపొందించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జులైలో రిటైర్డ్‌ సుప్రీంకోర్టు జడ్జి రంజనా దేశాయ్‌ అధ్యక్ష‍తన ఏడుగురు సభ్యులతో కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. మాజీ హైకోర్టు జడ్జి ఆర్‌.సి.చవాన్‌ ఈనెల 19వ తేదీన (శనివారం ) రాజీనామా చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సుదీర్ఘ చర్చలు జరపకుండానే సమావేశాలను ముగిస్తున్నారని చవాన్‌ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. సమావేశ వివరాల ఆమోదం, వెబ్‌సైట్‌ మార్పులు, ప్రశ్నావళిని ఖరారు చేయడం వంటి అజెండా అంశాలను చైర్‌పర్సన్ ఆదేశాల మేరకు త్వరితగతిన పూర్తి చేశారని ఆయన తెలిపారు. ప్రశ్నావళిని రూపొందించడంతో పాటు సభ్యుల నుండి పలు అంశాల్లో సభ్యుల సూచనలను పరిగణనలోకి తీసుకోలేదని, చైర్‌పర్సన్‌ ఖరారు చేసిన ప్రశ్నావళిని అప్పటికే అప్‌లోడ్‌ కోసం పంపిణీ చేశారని అన్నారు. ఆ కమిటీలో బయటి అధికారి కూడా ఒకరు ఉన్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. మరొక రాష్ట్రం నుండి అధికారిని పిలవడమంటే.. ఈ బాధ్యతను నిర్వహించే సామర్థ్యం తమకు లేదని మహారాష్ట్ర ప్రభుత్వం భావించి వుండవచ్చని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లేదా ఆ అధికారిని కమిటీ పనితీరులో ఎక్కడ భాగస్వామిని చేయాలో తెలియకపోవడం కూడా దీనికి ఒక కారణం కావచ్చని జస్టిస్‌ చవాన్‌ ఆ లేఖలో పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్