బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

9వ రోజు - కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

56 నిమిషాల క్రితం

Day 9 - Kalyana Venkateswara Swamy Brahmotsavams
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 01:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తుమ్మలగుంట (తిరుపతి) : తుమ్మలగుంటలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు బుధవారంతో 9వ రోజుకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టం చక్రస్నానంకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చక్రస్నానంకు హాజరై పుష్కరిణికి నమస్కరించారు. భూమన కరుణాకర్ రెడ్డికి ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. చక్రస్నానంకు ముందుగా విభూది వినాయకున్ని భూమన దర్శించుకున్నారు. ఆలయ పుష్కరణి వద్ధ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులకు వేడుకగా స్నపన తిరుమంజనం ఉంది. స్నపన తిరుమంజనం తరువాత చక్ర తాళ్వార్ కు పుష్కరిణిలో స్నానం ఆచరించారు. చక్రతాళ్వార్ తో పాటుగా పుష్కర స్నానంను చెవిరెడ్డి కుటుంబ సభ్యులు ఆచరించారు. ఆలయ పుష్కరణి వద్ధ పోలీసులు, ప్రయివేటు సెక్యూరిటీ సిబ్బంది పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నారు. పుష్కరణిలో స్నానం ఆచరించడానికి వచ్చే యాత్రికులను క్రమ పద్ధతిలో అనుమతించారు. చక్రస్నానం ఆచరించే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు చెవిరెడ్డి తెలిపారు.
01

02


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్