ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా: ఎమ్మెల్యే హామీ

06 అక్టోబర్, 2026

tirupati
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 04:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అవసరమైతే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానని వెల్లడి

ప్రజాశక్తి - సత్యవేడు : ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని, అవసరమైతే అసెంబ్లీలో ప్రస్తావిస్తానని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హామీ ఇచ్చారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మెలుగు రమేష్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు మంగళవారం ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశా వర్కర్లుగా మార్చి సమాన వేతనం, సౌకర్యాలు కల్పించడం, వారాంతపు, జాతీయ, పండుగ సెలవులతో పాటు క్యాజువల్, మెడికల్ లీవులు మంజూరు చేయడం, మరణించిన వర్కర్ల దహన సంస్కారాల ఖర్చులను ప్రభుత్వమే భరించాలని, ఖాళీ పోస్టుల భర్తీతో పాటు జనాభాకు అనుగుణంగా సంఖ్యను పెంచడం, పీహెచ్‌సీకి వెళ్లే ప్రతి సందర్భంలో టీఏ, డీఏ చెల్లించడం, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం శిక్షణ పొందిన వారికి పర్మినెంట్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వడం, రూ.10 లక్షల జీవిత బీమాతో పాటు నాణ్యమైన మొబైల్ ఫోన్లు, యూనిఫామ్‌లు అందించడం, గ్రాట్యుటీ సీలింగ్ ఎత్తివేయడం వంటి డిమాండ్లను వినతిపత్రంలో పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల జిల్లా కమిటీ సభ్యులు అనుగీత, సుమతి, మునిలక్ష్మి, రూతు, కోకిల, కస్తూరి, రాములమ్మ, సార్ల లావణ్య రాణి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్