విదేశాంగ మంత్రి జైశంకర్‌తో పాటు నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయానికి లేఖలు
ప్రజాశక్తి, తిరుపతి : నేపాల్‌లో ప్రకృతి విపత్తు కారణంగా ప్రభావితమైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారికి తక్షణ సహాయం అందించడంతో పాటు, గల్లంతైన వారి కోసం గాలింపు, రక్షణ చర్యలను ముమ్మరం చేయాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్‌ను కోరారు. ఈ మేరకు గురువారం విదేశాంగ మంత్రికి లేఖ రాసిన ఎంపీ, నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయ భారత రాయబారికి కూడా ప్రత్యేకంగా లేఖ రాశారు.
నేపాల్‌లో జరిగిన ప్రకృతి విపత్తు కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు గాయపడినట్లు, కొందరు ప్రాణాలు కోల్పోయినట్లు, మరికొందరి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని ఎంపీ గురుమూర్తి తన లేఖల్లో పేర్కొన్నారు. ఈ పరిస్థితి బాధితుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన, ఆవేదనకు కారణమవుతోందని తెలిపారు. నేపాల్ ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయం, సంబంధిత కాన్సులర్ అధికారులతో అత్యవసరంగా సమన్వయం చేసి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు.








కామెంట్‌లు (0)