తిరుపతి : ఒంటరిగా ఉన్న మహిళతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తిరుపతిలో జరిగింది. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .... కొర్లగుంట సంజయ్ గాంధీ కాలనీలో నివాసముంటున్న ఓ మహిళకు తెలిసిన ఓ వ్యక్తి ద్వారా మనీ యాదవ్ @ నరసింహులు పరిచయమయ్యాడు. మంగళంలోని డీకేటీ పట్టా ఉన్న ఇంటి స్థలాన్ని, పట్టాగా మార్చేస్తానని నమ్మించి పలు దపాల్లో మహిళ వద్ద 40 వేల రూపాయలను నరసింహులు కాజేశాడు. ఒంటరిగా ఉన్న ఆ మహిళ ఇంటిలోకి ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళ కేకలు పెట్టడంతో నరసింహులు అక్కడి నుండి పారిపోయాడు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఈస్ట్ ఎస్సై స్వాతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మహిళపై అసభ్య ప్రవర్తన
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 28, 2026, 03:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)