ప్రజాశక్తి-చంద్రగిరి (తిరుపతి) : లారీ అదుపుతప్పి కొండను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి వాహనం దగ్ధమయ్యింది.. అయితే డ్రైవర్ చాకచక్యంగా బయటకు దూకేయడంతో ప్రాణాలను దక్కించుకున్న ఘటన సోమవారం తిరుపతి జిల్లా చంద్రగిరిలో జరిగింది. పైప్‌ల లోడ్‌తో ఓ లారీ మహారాష్ట్రలోని బరంపూర్ నుంచి తిరుపతి వైపు వెళుతుంది. చంద్రగిరి పరిధిలోని బాకరాపేట ఘాట్ రోడ్డు వద్దకు రాగానే అదుపుతప్పి కొండను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి వాహనం అక్కడికక్కడే దగ్ధమైంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ త్రుటిలో తప్పించుకుని ప్రాణాలు నిలుపుకున్నారు. గమనించిన వాహనదారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే లారీ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
లారీ దగ్ధం - డ్రైవర్ సురక్షితం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 31, 2026, 02:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)