తెలంగాణ : వినాయక చవితి పండుగ సందర్భంగా .... తెలంగాణ ప్రజలకు బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కెసిఆర్ స్పందిస్తూ .... విఘ్నాలు తొలగించి, విజయాలను అందించే దైవంగా, వినాయకుణ్ణి హిందూ సమాజం కొలుచుకుంటుందని అన్నారు. దైవ పూజలను, ధార్మిక క్రతువులు విఘ్నేశ్వరుని పూజతో ప్రారంభించడం ద్వారా హిందూ సంప్రదాయాల్లో గణనాయకునికి తొలి ప్రాధాన్యతనిస్తామని కేసీఆర్ తెలిపారు. వాడ వాడలా మండపాలు ఏర్పాటు చేసుకుని తొమ్మిది రోజుల పాటు గణేశ్ నవరాత్రులు జరుపుకుంటూ, పిల్లలు పెద్దలు అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయకునికి పూజలు నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయం తిరిగి గాడినపడి, పాడి పంటలతో తెలంగాణ రైతు కుటుంబాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా దీవించాలని కోరుతూ, ఏకదంతున్ని ప్రార్థిస్తున్నట్లు కెసిఆర్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు : కెసిఆర్
28 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 14, 2026, 10:57 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)