ప్రజాశక్తి-చంద్రగిరి (తిరుపతి) : చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీ బైపాస్ సమీపంలో శుక్రవారం "ఫైన్ టెక్ ల్యాబ్ (Finetech Lab)" ప్రైవేట్ సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. ఎమ్మెల్యే కి పూర్ణకుంభంతో ఫైన్ టెక్ ల్యాబ్ సంస్థ మేనేజర్, సిబ్బంది, కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ముందుగా రిబ్బన్ కట్ చేసి ఫైన్ టెక్ సంస్థ ల్యాబ్ ను మేనేజర్, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఫైన్ టెక్ ల్యాబ్ సంస్థ వివరాలను ఎమ్మెల్యేకి మేనేజర్ వివరించారు. ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ .... నేటి ఆధునిక డిజిటల్ యుగానికి తగినట్లుగా యువతను తీర్చిదిద్దేందుకు ఈ సంస్థ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్, ఫైనాన్షియల్ సర్వీసెస్, డేటా అనలిటిక్స్ వంటి రంగాల్లో శిక్షణ అందించాలని మేనేజర్ను కోరారు. నిరుద్యోగ....నిర్మూలనే ధ్యేయంగా యువతకు కేవలం విద్యే కాకుండా, కార్పొరేట్ రంగానికి అవసరమైన ప్రాక్టికల్ నైపుణ్యాలను (Practical Skills) నేర్పించడంలో సంస్థ ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. ఈ సంస్థ ద్వారా చంద్రగిరి మండలం పరిధిలోని యువతి, యువకులకు ఉపాధి అవకాశాలలో తగిన ప్రాధాన్యత కల్పించాలని సంస్థ మేనేజర్ ను ఎమ్మెల్యే కోరారు. యువతకు ఉపాధి కల్పించే ఏ మంచి కార్యక్రమానికైనా తమవంతు పూర్తి సహకారాలు ఉంటాయని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
"ఫైన్ టెక్ ల్యాబ్ " ప్రైవేట్ సంస్థను ప్రారంభించిన ఎమ్మెల్యే పులివర్తి నాని
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 16, 2026, 12:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)