సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చంద్రగిరిలో పాసింగ్ అవుట్ పరేడ్

2 రోజుల క్రితం

Passing-out parade in Chandragiri
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 04:01 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-చంద్రగిరి (తిరుపతి) : చంద్రగిరి మండలం పరిధిలోని రంగంపేట పంచాయతీ కల్యాణి డ్యామ్ వద్ద గల పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ లో ఘనంగా పోలీస్ శిక్షణా కార్యక్రమం శుక్రవారం ముగింపు కార్యక్రమం జరిగింది. పోలీస్ శిక్షణా కళాశాలలో 2025–26 బ్యాచ్‌కు చెందిన 581 మంది SCTPCs (Civil) శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా “పాసింగ్ అవుట్ పరేడ్” నిర్వహించారు. పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి,ఎమ్మెల్యే పులివర్తి నాని హోజరైనారు.కార్యక్రమం లో మంత్రి, ,ఎమ్మెల్యేకి జిల్లా ఎస్పీ, పిటిసి ప్రిన్సిపల్ మరియు ఉన్నతాధికారులు సాదరసాగతం పలికారు. పాసింగ్ అవుట్ పరేడ్ లో మంత్రి, ఎమ్మెల్యే ట్రైనీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమైనదని మంత్రి రామ్ ప్రసాద్ తెలిపారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ తమ విధులను కర్తవ్యంతో నిర్వహించాలని శిక్షణ పూర్తిచేసుకున్న కానిస్టేబుళ్లకు ఎమ్మెల్యే దిశా నిర్దేశం చేసారు. అత్యాధునిక శారీరక, మానసిక, మరియు వృత్తిపరమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని పోలీసు వ్యవస్థలోకి అడుగుపెడుతున్న నూతనంగా విధులు నిర్వహించబోతున్న కానిస్టేబుళ్లకు, వారి కుటుంబ సభ్యులకు మంత్రి,ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఎలక్షన్ సమయంలో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన హామీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల మందికి పోలీసు శాఖ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించింది కూటమి ప్రభుత్వమే నని మంత్రి రామ్ ప్రసాద్ తెలియజేసారు. దానిలో భాగంగా తిరుపతి పోలీస్ శిక్షణా కళాశాలలో 581 మంది శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లో చేరుతున్నారు. శిక్షణ కాలంలో విధి నిర్వహణలో , ఇన్ డోర్, అవుట్ డోర్ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు సిబ్బందికి మంత్రి,ఎమ్మెల్యే బహుమతులు అందజేసారు. అనంతరం పోలీస్ శిక్షణా కళాశాలలో ప్రభుత్వ నిధులు ద్వారా సుమారు 16 లక్షలతో నూతనంగా వేసిన సీసీ రోడ్డును శిలాఫలకాన్ని ఆవిష్కరించి మంత్రి,ఎమ్మెల్యే , ఎస్పీ, తదితరులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Passing-out parade in Chandragiri

Passing-out parade in Chandragiri


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్