బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఢిల్లీ పోలీసుల అక్రమ ప్రవేశాన్ని నిరసిస్తూ ... సుళ్ళూరుపేటలో ప్రదర్శన

10 గంటల క్రితం

Protest in Sullurpeta against the illegal entry by Delhi Police.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 02:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-సూళ్లూరుపేట రూరల్ (తిరుపతి) : ఢిల్లీ పోలీసుల అక్రమ ప్రవేశాన్ని నిరసిస్తూ ... బుధవారం సుళ్ళూరుపేటలో సిపిఎం నిరసన ప్రదర్శన చేపట్టింది. సిపిఎం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఢిల్లీ పోలీసులు అక్రమంగా ప్రవేశించి ఎస్ఎఫ్ఐ జాతీయ నాయకురాలు ఐషే ఘోష్ ను అదుపులోకి తీసుకోవాలని చేసిన ప్రయత్నాన్ని సిపిఎం పార్టీ శ్రేణులు మరియు రాజ్యసభ సభ్యులు జాన్ బ్రిటాస్ గారు అడ్డుకొని వారి ఆగడాలు జరగకుండా అడ్డుకున్నారు. ఢిల్లీ పోలీసుల సహకారంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను అభ్యుదయకర శక్తులను విద్యార్థి సంఘ నాయకులను భయభ్రాంతులకు గురి చేయడంలో భాగంగా ఇది జరిగిందని సుళ్ళూరుపేట సిపిఎం పార్టీ కన్వీనర్ అల్లెయ్య గారు తెలిపారు. సెంటర్ శాఖ కార్యదర్శి కామ్రేడ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ .... బిజెపి ప్రభుత్వం పోలీసుల సహకారంతో అభ్యుదయకర శక్తులను అణిచివేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే సిపిఎం పార్టీ కేంద్ర కార్యాలయం లోకి పోలీసులు అక్రమ ప్రవేశం చేశారని , ఇది బిజెపి ప్రభుత్వ నిరంకుశ నియంతృత్వ ధోరణి ని బట్టబయలు చేస్తున్నదని బిజెపి అధికారంలోకి వచ్చినప్పటినుండి భారతదేశంలో ప్రజాస్వామిక హక్కులు కాలరాయ బడుతున్నదని ఈ ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవడం కోసం ప్రజాస్వామ్య వాదులను అభ్యుదయకర స్థితులను ఏకం చేయడానికి సిపిఎం పార్టీ కృషి చేస్తుందని బిజెపి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని తెలియపరిచారు. టౌన్ శాఖా కార్యదర్శి కామ్రేడ్ రియాజ్ మాట్లాడుతూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుందని ఈ ప్రయత్నానికి సిపిఎం పార్టీ అడ్డుకట్ట వేస్తుందని తెలియపరిచారు ఈ నిరసన కార్యక్రమంలో రూరల్ శాఖ కార్యదర్శి ఆటో సంఘం నాయకులు కామ్రేడ్ లక్ష్మయ్య సీనియర్ నాయకులు సుధాకర్ రావు గారు మరియు కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి డమ్మాయి ప్రభాకర్ సిపిఎం పార్టీ శ్రేణులు మరియు ప్రజాసంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్