విచ్చలవిడిగా నడుపుతున్న అనధికార బెల్టు షాపులు
నిద్రావస్థలో ఎక్సయిజ్ అధికారులు
ప్రజాశక్తి-చంద్రగిరి (తిరుపతి) : చంద్రగిరి మండలంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎనీ టైం మద్యం కావాలంటే చంద్రగిరి, రంగంపేట లో జోరుగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. చంద్రగిరిలో గుడి బడి తేడా లేకుండా మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారు. చంద్రగిరి లోని బార్ , బెల్ట్ షాపులు పోటాపోటీగా రాత్రి పగలు తేడా లేకుండా మద్యం అమ్మకాలు సాగిస్తున్నాడంతో మద్యం బాబులకు ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. చంద్రగిరి గ్రామ దేవత అయిన శ్రీ మూలస్థానంఎల్లమ్మ ఆలయ సమీపంలో ఉదయం 5 గంటల నుండి మద్యం దొరకడంతో నడిరోడ్డుపై కూర్చుని మందు బాబులు మందు తాగుతున్నారు. అలాగే రంగంపేటలో ప్రముఖ విద్యా సంస్థల దగ్గర లో గేజీట్ నియమాలకు వ్యతిరేకంగా 20మీటర్ల లోపే వైన్ షాప్ నిర్వహిస్తూ, రాత్రి 10 గంటల నుండి ఉదయం 10గంటల లోపు అధిక ధరలకు అమ్ముకొంటూ సొమ్ము చేసుకొంటున్నారు. అటుగా వెళ్లే స్కూల్ పిల్లలు, మహిళలు , స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఆలయ అధికారులు ఇటీవల కాలంలో సిబ్బంది పై దాడి చేసిన వారిని కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది. ఆలయానికి ఉండే పేరు ప్రతిష్టలు ఇటువంటి సంఘటన వలన మసకబారుతున్నది. బార్ లు, మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు యదేచ్చగా ఎనీ టైం మద్యం అమ్మకాలు జరుగుతున్న అటువైపు ఎక్సైజ్ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. ఎక్సైజ్ అధికారులకు 5500 ఇస్తే వారే స్వయంగా బెల్ట్ షాపులకు అనుమతులు ఇచ్చి అమ్మకాలు సాగించండి అంటూ ప్రోత్సహిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుడి బడి ఉన్న ప్రాంతాలలో మద్యం అమ్మకాలు లేకుండా చేయాలని స్థానికులు కోరుతున్నారు.








కామెంట్‌లు (0)