చంద్రగిరి (తిరుపతి) : ఆర్టిసి బస్సు ఎదురుగా వస్తున్న స్కూటర్ ను ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన సోమవారం ఉదయం చంద్రగిరి ఫ్లైఓవర్ వద్ద జరిగింది. చంద్రగిరి పట్టణంలో చంద్రగిరి ఫ్లైఓవర్ వద్ద హైవే నుంచి తిరుపతి వైపు సర్వీస్ రోడ్డులోకి వస్తున్న ఆర్టిసి బస్సు ఎదురుగా వస్తున్న స్కూటర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటర్ పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ప్రైవేట్ వాహనంలో సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారు తిరుపతికి చెందినవారుగా తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
స్కూటర్ ను ఢీకొట్టిన ఆర్టిసి బస్సు - ఇద్దరికి తీవ్రగాయాలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 31, 2026, 10:55 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)