ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : ఎగువ కనకపాలెం పంచాయతీ మిద్దిగుంట ఏఏ డబ్ల్యూ గ్రామంలో దళితులు త్రాగునీటి కోసం గత 15 రోజులుగా ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదనిన స్థానిక మహిళలు కాళీ బిందులతో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా హెచ్ పి ఎస్ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు డి మహేష్ మాట్లాడుతూ.. నీటి కోసం అధికారులను సంప్రదించగా డబ్బులు వేసుకొని మీరే రిపేరు చేసుకోవాలని అధికారులు చెప్పడం చాలా దారుణమని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్న ఇంకా కూడా దళిత గ్రామాలు నీళ్ల కోసం అధికారులు, రాజకీయ నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి గ్రామంలో త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మాధవి, రాధా, మాలతి, లక్ష్మి, శకుంతల, నాగరత్నం, హేమలత తదితరులు పాల్గొన్నారు, . . తాగునీటి కోసం రోడ్డుపై మహిళలు ధర్నా
దళితవాడకు త్రాగునీరు ఏర్పాటు చేయాలని మహిళలు ధర్నా
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 31, 2026, 05:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)