మురసు తుఫాన్ ప్రభావం.....
నురగలు కక్కుతున్న పాకల సముద్రం అలలు
అధికారులు అప్రమత్తం గా ఉండాలి
మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలి : జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి
ప్రజాశక్తి - శింగరాయకొండ (విజయనగరం) : మురసు తుఫాను ప్రభావం కారణంగా .... శింగరాయకొండ మండలం పాకల సముద్ర తీరం దగ్గర సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఆ సముద్రపు అలల తాకిడికి సముద్రం నురగలు కక్కుతుంది. మత్స్యకారులంతా వారి బోట్లు, వలలను సురక్షిత ప్రాంతానికి తరలించుకుంటున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి సముద్రం పరిస్థితిని పరిశీలించారు. సముద్ర తీరాన్ని సందర్శించి అక్కడ మత్స్యకారులకు అవగాహన కల్పించారు. మత్స్యకారులంతా సురక్షిత ప్రాంతాలకి రావాలని సూచించారు. సోమవారం, మంగళవారం ఉధృతంగా తుఫాను ఉండే ప్రభావం ఉందని, మత్స్యకారులంతా సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని సూచించారు. సముద్రం వద్ద ఎవరినీ అనుమతించేది లేదని చెప్పారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.










కామెంట్‌లు (0)