ప్రజాశక్తి, విజయనగరం టౌన్ : జె ఎన్ టి యు లో జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. భారతదేశ ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడల ప్రాముఖ్యత, శారీరక దారుఢ్యం, ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమశిక్షణ, జట్టుస్ఫూర్తి మరియు నాయకత్వ లక్షణాలపై అవగాహన కల్పించారు. సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా, శారీరక దృఢత్వ కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ట్రోఫీలు మరియు ప్రశంసా పత్రాలు వైస్ ఛాన్సలర్ వి వి సుబ్బారావు చేతులు మీదుగా అందజేశారు. విజేతలను అధికారులు, అధ్యాపకులు అభినందించి, క్రీడల్లో మరింతగా రాణించాలని ప్రోత్సహించారు.
జె ఎన్ టి యు లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 29, 2026, 03:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)