శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎపి లో ప్రైవేటు మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో ఫీజులు పెంపు

1 గంట క్రితం

Fees hiked in private medical and dental colleges in AP
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 03:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యలో ఫీజులు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 10 శాతం ఫీజులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఫీజులు పెరిగాయి. ఎంబీబీఎస్ ఏ కేటగిరీ ఫీజు రూ.18,150కి పెరిగింది. బీ కేటగిరీ ఫీజు రూ.14,52,000 కి పెరిగింది. సీ కేటగిరీ రూ.43.56 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. బీడీఎస్ ఏ కేటగిరీ ఫీజు రూ.15,730 కి పెరిగింది. బీ కేటగిరీ రూ.4,84,000 కి పెరిగింది. సీ కేటగిరీ రూ.14,52,000కి పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్