బెంగళూరు : కన్నడ చిత్ర పరిశ్రమ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ప్రపంచ స్థాయిలో మరో చారిత్రాత్మక ఘనత సాధించారు. ప్రతిష్టాత్మక ‘ఫోర్బ్స్ ఇండియా’ ప్రచురించిన దేశంలోని టాప్– 100 ప్రముఖుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. రిషబ్ శెట్టి ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో ఒక ప్రత్యేక రికార్డుని సృష్టించారు. సినీనటుడు, దర్శకుడు, రచయిత అనే ఈ మూడు విభాగాల్లో ఏకకాలంలో ఎంపికైన దేశంలోని ఏకైక ప్రముఖుడిగా రిషబ్ నిలిచారు. ఈ ఘనతని ఇంతకుముందెన్నడూ ఏ భారతీయ చిత్ర పరిశ్రమ ప్రముఖుడూ సాధించలేదు. హొంబాళె ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించిన కాంతార రెండు సినిమాలు.. ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించాయి. దీని ద్వారానే రిషన్ పాన్ ఇండియా స్టార్‌డమ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మతో కలిసి 'జై హనుమాన్', హిందీ దర్శకుడితో ఛత్రపతి శివాజీ బయోపిక్ మూవీలో నటిస్తున్నారు.
రిషబ్ శెట్టి చారిత్రాత్మక ఘనత
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 29, 2026, 03:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)