మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై పోలీసుల జులుం

15 నిమిషాల క్రితం

Police brutality against town planning staff
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 12:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కార్యాలయంలోకి వచ్చి టి పి ఎస్ తో పోలీసులు వాగ్వివాదం


ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : పాత టూ టౌన్ పోలీస్ స్టేషన్ స్థలంలో అనుమతులు లేకుండా జరుగుతున్న నిర్మాణంపై టౌన్ ప్లానింగ్ సిబ్బంది కొరడా ఝళిపించారు. అక్రమ నిర్మాణం తొలగించేందుకు మంగళవారం కమిషనర్ ఆదేశాలతో వెళ్లిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఆ నిర్మాణాన్ని తొలగించారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు స్థలం వద్దకు వచ్చి టౌన్ ప్లానింగ్ సిబ్బంది పై చేయిచేసుకుని సిబ్బందిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. అంతేకాకుండా నగర పాలక సంస్థ కార్యాలయంలో ఉన్న టి పి ఎస్ అనిత దగ్గరకి వెళ్లి ఆమెతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. ఆమె కమిషనర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామని ఏదైనా ఉంటే కమిషనర్ తో మాట్లాడాలని చెప్పినప్పటికీ వినకుండా ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఏదైనా కమిషనర్ తో మాట్లాడుకోవాలని పోలీసులకు ఆమె తేల్చి చెప్పారు. పోలీసుల తీరుపై అధికారులు, టౌన్‌ ప్లానింగ్‌ సిబంది మండిపడుతున్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు మున్సిపల్ సిబ్బందిపై దాడి చేయడంపై అధికారులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Police brutality against town planning staff


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్